Vivo V70 Price Drop : క్రేజీ ఆఫర్ మావా.. ఈ వివో ఫోన్ డిస్కౌంట్ అదుర్స్.. అమెజాన్‌లో ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Vivo V70 Price Drop : కొత్త వివో ఫోన్ ఆఫర్ అదిరింది. వివో వి70 ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 4500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/8
Vivo V70 Price Drop : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఈ వివో V70 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 59,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 50వేల లోపు ధరకే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్, కార్డు ఆఫర్లతో ఈ వివో ఫోన్ తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
2/8
ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్ల పరంగా చూస్తే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. అమెజాన్‌లో వివో V70 డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/8
వివో V70 అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో వివో V70 ఫోన్ రూ. 53,999 ధరతో లాంచ్ అయింది. కానీ, ధర రూ. 6వేలు పెరిగి రూ. 59,999కి చేరింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కేవలం రూ. 55,200కే లభిస్తోంది. అంటే.. రూ. 4,799 నేరుగా డిస్కౌంట్ లభిస్తోంది.
4/8
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ప్రైమ్ మెంబర్ యూజర్లు అదనంగా 5 శాతం తగ్గింపు పొందవచ్చు. ప్రైమ్ మెంబర్ కాని యూజర్లు మాత్రం 3 శాతం తగ్గింపు పొందవచ్చు.
5/8
అమెజాన్‌లో నెలకు కేవలం రూ. 1,941 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందవచ్చు. అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది రూ. 34,350 వరకు పొందవచ్చు.
6/8
వివో V70 స్పెసిఫికేషన్లు : ఈ ఫోన్ లోపల క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,500mAh బ్యాటరీ కూడా ఉంది.
7/8
డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ ప్యానెల్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కెమెరా ప్రియుల కోసం 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కూడా ఉంది. ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో అనే 2 కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.
8/8
వివో V70 కొనాలా? వద్దా? : ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్, మంచి కెమెరా ఫోన్, తక్కువ బడ్జెట్‌లో కావాలంటే వివో V70 బెస్ట్ ఆప్షన్. అమెజాన్‌లో ప్రస్తుతం డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. నేరుగా డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్, కార్డు ఆఫర్లతో మరింత తగ్గుతుంది..