YS Sharmila Son Marriage Pics: ఘనంగా వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ వేడుక.. ఫొటోలు చూశారా
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహ వేడుక రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో అట్టహాసంగా జరిగింది. క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను షర్మిల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో విజయమ్మ, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్, వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో పాటు.. అట్లూరి ప్రియ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గొన్నారు.