గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 48 గంటలు దాటకముందే మంగళగిరి ప్రాంతంలో నోట్ల కట్టల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న 80లక్షల రూపాయల డబ్బుని గుర్తించారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ దగ్గర పోలీసులు ఈ నగదుని స్వాధీనం చేసుకున్నారు. పొలం కొనుగోలు కోసం డబ్బుతో రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్తున్నట్లు శ్రీనివాస్ వివరణ ఇచ్చినప్పటికీ … సరైన ఆధారాలు చూపించకపోడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆ డబ్బుని ఇన్‌కం ట్యాక్స్ అధికారులను అప్పజెప్పారు.
Read Also : ఎవర్నీ వదలడు : లక్ష్మీస్ ఎన్టీఆర్ లోకి మోడీని లాగిన వర్మ
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం తరలింపు అక్రమాలు ఎక్కువగా జరుగుతాయని గుర్తించిన ఈసీ.. నిఘా పెంచింది. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చీ పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విజయవాడ-గుంటూరు సరిహద్దు ప్రాంతం మంగళగిరిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న రూ.80లక్షలను బాగేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also : బీజేపీ ఢిల్లీ అభ్యర్థిగా గౌతం గంభీర్?