Rowdy Sheeter Sunil: బీజేపీ కార్యక్రమంలో పేరు మోసిన రౌడీ షీటర్.. సమాజ సేవ చేస్తున్నానంటూ స్టేట్‭మెంట్

పోలీసుల దాడిలో దొరకని రౌడీ షీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చాడంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో బెట్టింగులకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీలో చేరి మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఘాటుగా స్పందించారు. విపక్ష నేత సిద్ధరామయ్య సైతం ఈ విషయమై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

Rowdy Sheeter Sunil: భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఓ రక్తదాన కార్యక్రమంలో పేరు మోసిన ఓ రౌడీ షీటర్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రౌడీ షీటర్.. రక్తదానం చేసిన అనంతరం తాను సమాజ సేవ చేస్తున్నానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయమై అధికార, విపక్షాల మధ్య చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో బెంగళూరులోనే అత్యంత భయంకరమైన రౌడీ షీటర్‭గా పేరు మోసిన సునీల్ అనే వ్యక్తి పాల్గొన్నాడు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, ఎమ్మెల్యే ఉదయ్ గరుడహర్, బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ సహా ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Coconut Tree: నట్టింట్లో చెట్టును కదలించింకుండా రెండస్తుల నిర్మాణం.. తాత జ్ఞాపకాలను కాపాడటం కోసం కుటుంబం విశిష్ట ప్రయోగం

వీరందరితో సునీల్ అత్యంత సన్నిహితంగా కనిపించాడు. ఇక అంతే, సునీలో తొందరలోనే బీజేపీలో చేరనున్నట్లు వార్తలు రావడం ప్రారంభించాయి. ఇది బీజేపీని తీవ్ర ఇరకాటంలో పడేసింది. దీన్ని ఆధారం చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెడుతోంది. కాంగ్రెస్ విమర్శలతో ఉక్కిరి బిక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీకి, తాజా వివాదం మరింత తలనొప్పిగా మారింది. దీంతో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిని కుమార్ స్పందించాల్సి వచ్చింది. ఈ విషయమై పార్టీ నేతలను వివరణ కోరతానని చెప్పేంత వరకూ వచ్చింది. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ సైతం ఇవ్వడం గమనార్హం.

Man Dies While Dancing : వీడియో.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

పోలీసుల దాడిలో దొరకని రౌడీ షీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చాడంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో బెట్టింగులకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీలో చేరి మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఘాటుగా స్పందించారు. విపక్ష నేత సిద్ధరామయ్య సైతం ఈ విషయమై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సీఎం బొమ్మై సమాధానమిస్తూ.. రాష్ట్రంలో రౌడీ షీటర్ల సంఖ్యను తేల్చి చెప్పమని సవాల్ విసిరారు.

Rahul Gandhi Bharat Jodo Yatra: ఉత్సాహంగా కొన‌సాగుతున్న‌ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌.. (ఫొటోలు)

ట్రెండింగ్ వార్తలు