Man Dies While Dancing : వీడియో.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

పెళ్లి వేడుకలో అప్పటివరకు సరదాగా డ్యాన్స్ చేస్తున్న 40ఏళ్ల వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.

Man Dies While Dancing : వీడియో.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

Man Dies While Dancing : అదో పెళ్లి వేడుక. ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా ఉన్నారు. కుటుంబసభ్యులు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వ్యక్తి ఆనందంతో డ్యాన్స్ చేయసాగాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. అతడికి ఏమైందా అని దగ్గరికెళ్లి చూడగా.. ఆ వ్యక్తి మృతి చెందాడని తెలిసి షాక్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటివరకు సరదాగా డ్యాన్స్ చేస్తున్న 40ఏళ్ల వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read : Rajasthan Chain Snatch : షాకింగ్ వీడియో.. షాపింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి చైన్ ఎలా లాక్కెళ్లాడో చూడండి..

ఓ వ్యక్తి తన మేనల్లుడి పెళ్లిలో సరదాగా డ్యాన్స్ చేస్తున్నాడు. మహిళలతో కలిసి స్టెప్పులు వేస్తున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి అతడికి గుండెపోటు రావడంతో కుప్పకూలాడు.

కంగారుపడిన కుటుంబసభ్యులు అతడి దగ్గరికి వెళ్లి చూశారు. అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ, అతడిలో ఎలాంటి చలనం లేదు. బంధువులు ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతడి మృతితో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా వంటి ప్రముఖులు సైతం గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఇలా పలువురు మరణించడం వారి అభిమానులను బాధకు గురిచేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, ఇటీవలి కాలంలో యువతతో పాటు అన్ని ఏజ్ గ్రూపుల్లో గుండెపోటు కామన్ గా మారడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. మారిన జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. చాలామంది గుండెపోటు బారిన పడేందుకు ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. మూడు పదుల వయస్సులోపు వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.

Also Read : Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..