వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ తీరును తప్పు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. బీజేపీతో సఖ్యతపై పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టలేమన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. బుధవారం(డిసెంబర్ 4, 2019) అచ్చెన్నాయుడితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ ఎవరికి వ్యతిరేకం కాదని.. ప్రజల సమస్యలపై పోరాడుతారని చెప్పారు. హోదా విషయంలో మాత్రమే బీజేపీతో విభేదించారని తెలిపారు. తమ ఓటమితో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అనుకుంటున్నారని చెప్పారు. పవన్ వ్యాఖ్యలను తప్పు పెట్టాల్సిన పని లేదన్నారు.