Kerala Politics: సోషల్ మీడియా దాడిపై పోలీసులను ఆశ్రయించిన మాజీ సీఎం కుమార్తె

పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో తనపై జరిగిన సైబర్ దాడులను అచ్చు ఊమన్ ఖండించారు. ఇదంతా కేరళలో ప్రస్తుత అవినీతి, ధరల పెరుగుదల సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే అని ఆమె అన్నారు

Achu Oommen: కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న పుత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుటుంబానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. కారణం.. ఆ స్థానం నుంచి ఊమెన్ చాందీ వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఆయన మరణానంతరం పుత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి ఆయన కుమారుడు చాందీ ఊమెన్ పోటీ చేస్తున్నారు.

Telangana elections 2023: ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీ.. అభ్యర్థుల జాబితా ప్రకటనపై వివరాలు తెలిపిన కిషన్ రెడ్డి

అయితే తనపై సైబర్ దాడి జరుగుతోందంటూ ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం తిరువనంతపురంకు చెందిన ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. “నిందితుడు అచ్చు ఊమెన్‌ను పరువు తీయాలనే ఉద్దేశ్యంతో దురుద్దేశంతో ప్రజలకు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. అచ్చు ఊమెన్ సహా ఆమె దివంగత తండ్రి అవినీతిపరులంటూ అవాస్తవమైన, తప్పుడు, దూషణాత్మకమైన ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నాడు” అని ఫిర్యాదు కాపీలో రాసుకొచ్చారు.

Chandrababu : ఒంటరిగానే పోటీ, బీజేపీతో పొత్తుకు టైమ్ దాటి పోయింది : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అదే సమయంలో, పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో తనపై జరిగిన సైబర్ దాడులను అచ్చు ఊమన్ ఖండించారు. ఇదంతా కేరళలో ప్రస్తుత అవినీతి, ధరల పెరుగుదల సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే అని ఆమె అన్నారు. కొన్నేళ్లుగా ఫ్యాషన్, ట్రావెల్ రంగంలో కంటెంట్ క్రియేటర్‌గా ఆమె పని చేస్తోంది. ఆ సమయంలో తీసిన ఫొటోలను తండ్రి ప్రతిష్టను కించపరిచే ఉద్దేశపూర్వక ఉద్దేశ్యంతో స్వార్థ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Geetika Srivastava: పాకిస్తాన్‭లో అత్యున్నత పదవికి మొదటి భారత మహిళగా రికార్డ్ సృష్టించిన గీతిక శ్రీవాస్తవ.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

మరోవైపు పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సెప్టెంబర్ 5న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. పుత్తుపల్లెలో కాంగ్రెస్‌-యూడీఎఫ్‌ అభ్యర్థిగా అచ్చు ఊమెన్‌ సోదరుడు చాందీ ఊమెన్‌ పోటీ చేస్తున్నారు. సీపీఐ(ఎం) నుంచి జాక్‌ సీ థామస్‌ పోటీ చేస్తున్నారు. అయితే అచ్చుపై జరిగిన సైబర్‌ దాడులపై థామస్ స్పందిస్తూ.. ఎవరిపైనా వ్యక్తిగత దూషణలను అంగీకరించలేమని అన్నారు.