Akhilesh Yadav: బాబాయ్ శివపాల్ పాదాలను తాకిన అఖిలేష్.. కోల్డ్ వార్ ముగిసినట్టేనా?
పార్టీలో కుటుంబంలో అంతర్గత విబేధాలతో ములాయం, శివపాల్ విడిపోయారు. పార్టీ పగ్గాలను అఖిలేష్‌కు అప్పగించడంతోనే శివపాల్ అలిగి వేరు కుంపటి పెట్టుకున్నారని విమర్శలు బలంగానే వచ్చాయి. 2017 నుంచి ఈ విభేదాలు ఉన్నాయి. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు వర్గాలను కలిపే ప్రయత్నాలు జరిగాయి
- tony bekkal
- Published On : November 20, 2022 / 05:10 PM IST
Akhilesh Yadav Touches Uncle Shivpal Yadav's Feet
Akhilesh Yadav: ములాయం కుటుంబంలో ముసలం ముగిసినట్లేనా, లేదంటే ఇది కేవలం ఎన్నికల స్టంటా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల్ని చూసినట్టైతే అంతా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఈ మాట ఏకంగా ములాయం కుటుంబ సభ్యులే స్వయంగా ప్రకటించారు కూడా. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం మెయిన్‌పురి నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అఖిలేష్, డింపుల్ సహా ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంలోనే శివపాల్ పాదాలను అఖిలేష్ తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ తమ మధ్య ఎప్పుడూ ఎలాంటి విబేధాలు లేవని, ఉండబోవని అన్నారు. మెయిన్‌పురి ఉప ఎన్నిక బరిలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ములాయం ఎంపీ గెలిచారు. అయితే ఆయన గత నెలలో మరణించడంతో ఉప ఎన్నిక ఏర్పడింది.
పార్టీలో కుటుంబంలో అంతర్గత విబేధాలతో ములాయం, శివపాల్ విడిపోయారు. పార్టీ పగ్గాలను అఖిలేష్‌కు అప్పగించడంతోనే శివపాల్ అలిగి వేరు కుంపటి పెట్టుకున్నారని విమర్శలు బలంగానే వచ్చాయి. 2017 నుంచి ఈ విభేదాలు ఉన్నాయి. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు వర్గాలను కలిపే ప్రయత్నాలు జరిగాయి. ములాయం సింగ్ యాదవ్ పిలుపు మేరకు వీరిద్దరూ ఏకమైనప్పటికీ.. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మళ్లీ దూరంగానే ఉంటూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు మెయిన్‌పురి ఉప ఎన్నికతో ఇలా ఒకే వేదికపై కనిపించారు.
Self Respect: గవర్నర్ తొలగింపు, సీఎం రాజీనామా.. ఆత్మగౌరవంపై శివసేన డిమాండ్
