Self Respect: గవర్నర్ తొలగింపు, సీఎం రాజీనామా.. ఆత్మగౌరవంపై శివసేన డిమాండ్
శివాజీ మహరాజ్‌ను గవర్నర్ అవమానించారు. ఇదే సంవత్సరంలో నాలుగు సార్లు అవమానించారు. ఇప్పటికీ ప్రభుత్వం మౌనంగానే ఉంది. శివాజీ మహరాజ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విగ్రహంలా భావిస్తారని ఆయన అన్నారు. అలాగే నిన్నటికి నిన్న ‘పాత విగ్రహం’ అంటూ అవమానించారు. అలాగే ఔరంగాజేబ్‌కు శివాజీ ఐదుసార్లు క్షమాపణలు చెప్పారని అన్నారు

Sanjay Raut's Self Respect Jab At Eknath Shinde
Self Respect: ఆత్మగౌరవంతో శివసేనను చీల్చి ముఖ్యమంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు నిజంగానే ఆత్మగౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ ఛాలెంజ్ చేశారు. ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలను గుర్తు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే కోశ్యారిని గవర్నర్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. శివాజీపై ‘పాత విగ్రహం’ అంటూ కోశ్యారి వ్యాఖ్యానించారని, ఇలా గతంలో అనేకసార్లు శివాజీని అవమానించారని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
ఈ విషయమై ఆదివారం ఆయన మాట్లాడుతూ ‘‘శివాజీ మహరాజ్‌ను గవర్నర్ అవమానించారు. ఇదే సంవత్సరంలో నాలుగు సార్లు అవమానించారు. ఇప్పటికీ ప్రభుత్వం మౌనంగానే ఉంది. శివాజీ మహరాజ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విగ్రహంలా భావిస్తారని ఆయన అన్నారు. అలాగే నిన్నటికి నిన్న ‘పాత విగ్రహం’ అంటూ అవమానించారు. అలాగే ఔరంగాజేబ్‌కు శివాజీ ఐదుసార్లు క్షమాపణలు చెప్పారని అన్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి చేసిన వ్యాఖ్యాలివి. ఇదేనా బీజేపీ అసలైన రూపం? ఇదేనా మహారాష్ట్ర మీద బీజేపీకి ఉన్న గౌరవం? దీని మీద బీజేపీ క్షమాపణ చెప్పడంతో పాటు, గవర్నర్ కోశ్యారీని ఈ రాత్రే తొలగించాలి’’ అని డిమాండ్ చేశారు.
ఇక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఈ విషయమై తీవ్రంగా తప్పు పట్టారు. దీనికి ఆత్మగౌరవాన్ని జోడించి తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే రాజీనామా డిమాండ్ చేశారు. ‘‘ఆత్మ గౌరవం పేరుతో శివసేనను చీల్చిన ఏక్నాథ్ షిండే ఆత్మగౌరవం ఇప్పుడు ఎక్కడ పోయిందో నాకు అర్థం కావడం లేదు. శివాజీ మహరాజ్‌ను బీజేపీ అంత బహిరంగంగా హేళన చేస్తోంది. అయినప్పటికీ షిండే మౌనంగా ఉన్నారు. మీకు నిజంగానే ఆత్మగౌరవం ఉంటే ఇంకా బీజేపీతో ఎందుకు ఉన్నారు? ఇంకా ఆ సీఎం పదవిలో ఎందుకు ఉన్నారు? వెంటనే రాజీనామా చేయండి’’ అని రౌత్ అన్నారు.
Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం.. అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ