Akhilesh Yadav: ఈసారి ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా? ఎస్పీ చీఫ్ అఖిలేష్ జోస్యం ఏంటంటే..?

వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానమూ గెలవదంటూ అఖిలేష్ జోస్యం చెప్తుండడం గమనార్హం.

Akhilesh Yadav: రాబోయే సార్వత్రిక ఎన్నికలపై సమాజ్‭వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరగబోయే లోక్‭సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటంటే, ఒక్కటి కూడా గెలవదని అన్నారు. వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానమూ గెలవదంటూ అఖిలేష్ జోస్యం చెప్తుండడం గమనార్హం.

KS Bhagwan: రాముడు ఆదర్శవంతుడు కాదు, 11 వేళ్ల ఏళ్లు పాలించనూ లేదు.. కన్నడ రచయిత హాట్ కామెంట్స్

అయితే బీజేపీ దారుణ పరాభవానికి గల కారణాల్ని కూడా అఖిలేష్ వెల్లడించారు. బీజేపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా అంతరించిపోయాయని, ప్రజలు నిత్యం నేరాలు, ఘోరాల మధ్య జీవనం సాగిస్తున్నారని అన్నారు. యూపీ ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అఖిలేష్ అన్నారు. ‘‘ఇంకో 50 ఏళ్లు తామే పాలిస్తామని చెప్పుకుంటున్న పార్టీ ఇప్పుడు రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒకసారి రాష్ట్రానికి వచ్చి రెండు మెడికల్ కాలేజీలు తిరిగితే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవమని ఆయనకే తెలుస్తుంది’’ అని అఖిలేష్ అన్నారు.

Guruvayur Temple: రూ.1,700 కోట్లు, 260 కేజీల బంగారం, 271 ఎకరాలు.. గురువాయూర్ గుడి ఆస్తులివి

ట్రెండింగ్ వార్తలు