పీవీపీ ఇలా బుక్కయ్యాడేంటి!

తెలుగు మహిళా సీఎంను చూడాలనుకుంటున్నానంటూ చేసిన ట్వీట్ వివాదాస్పదమవడంతో పీవీపీ ట్వీట్ డిలీట్ చేశారు..

  • Publish Date - February 20, 2020 / 11:34 AM IST

తెలుగు మహిళా సీఎంను చూడాలనుకుంటున్నానంటూ చేసిన ట్వీట్ వివాదాస్పదమవడంతో పీవీపీ ట్వీట్ డిలీట్ చేశారు..

అమరావతి : తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేసి.. ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) సెన్సేషణ్ క్రియేట్ చేశార. ఆయన చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సొంత పార్టీ వైసీపీలో కూడా కాక రేపుతోంది.

అసలు ఆయన చేసిన ట్వీట్ యెక్క వివరాలు ఏంటంటే.. ‘బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ.. మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు..

అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం’ అంటూ ట్వీట్ చేశారు.. ఆయన ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశాడో కానీ ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.

కట్ చేస్తే, కాసేపటి తర్వాత ఆయన ట్వీట్‌ డిలీట్ చేశారు. కానీ, నెటిజన్స్ అప్పటికే ఈ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ పీవీపీ కోరుకుంటున్న ఆ మహిళా సీఎం ఎవరు? అంటే.. ఇంకెవరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Read More>>రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా