ఏపీ అసెంబ్లీ : పలు అంశాలపై చర్చ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. అవినీతి నిర్మూలన, పారదర్శకత, జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.

  • Publish Date - December 13, 2019 / 03:37 AM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. అవినీతి నిర్మూలన, పారదర్శకత, జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. అవినీతి నిర్మూలన, పారదర్శకత, జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. ఎన్నికల తర్వాత చాలా గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటం, అన్ని ప్రభుత్వ శాఖల్లో బిల్లుల పెండింగ్ పై టీడీపీ ప్రశ్నలు వేయనుంది. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ పై విచారణ, రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల మిగులు, రాజధానిలోని కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమాలపై వైసీపీ ప్రశ్నలు లేవనెత్తనుంది. 
రాజధాని మార్పు, సన్న బియ్యం సరఫరాపై మండలిలో టీడీపీ ప్రశ్నలు అడగనుంది. శాంతిభద్రతలు, అమరావతి నిర్మాణంపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది.