ఎమ్మెల్యేలకు జగన్ షాక్, స్థానిక ఎన్నికల్లో మీ బంధువుల‌కు బీ-ఫామ్ ఇవ్వం, కార్యకర్తలకే సీట్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల కుటుంబీకులు, బంధువుల‌కు బి-ఫారాలు ఇవ్వ‌బోమని వైసీపీ తెలిపింది. 

  • Publish Date - March 11, 2020 / 08:49 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల కుటుంబీకులు, బంధువుల‌కు బి-ఫారాలు ఇవ్వ‌బోమని వైసీపీ తెలిపింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులు పోటీ చేయొద్దని ఆదేశించింది. పోటీకి సిద్ధపడితే బీ-ఫామ్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. కార్యకర్తలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల కుటుంబీకులు, బంధువుల‌కు బి-ఫారాలు ఇవ్వ‌బోమని వైసీపీ తెలిపింది. 

పార్టీ విధి విధానాలలో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల కుటుంబ స‌భ్యులు, స‌మీప బంధువుల‌ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో పోటీకి దించ‌కూడ‌దని సూచించింది. కావునా పార్టీ విధి విధానాల‌కు లోబ‌డి ఎమ్మెల్యేలు, నియోక‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు వారి కుటుంబ స‌భ్యుల‌ను, స‌మీప బంధువుల‌ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల భ‌రిలో ఉంచ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నామని తెలిపింది. 

ఈ మేరకు బుధవారం (మార్చి 11, 2020) తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి శాస‌న స‌భ్యులు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు ఒక సర్క్యులర్ జారీ చేశారు. వారిలో ఎవ‌రైనా కుటుంబ స‌భ్యుల‌ను, స‌మీప బంధువుల‌ను పోటీలో ఉంచిన‌ట్ల‌యితే వారికి బి-ఫారం ఇవ్వ‌రాద‌ని గౌర‌వ‌ పార్టీ జోన‌ల్ ఇంఛార్జ్ ల‌కు, రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ల‌ు, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఇంఛార్జుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

సర్క్యులర్ కాపీని పార్టీ జోన‌ల్ ఇంఛార్జ్ ల‌కు, రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ల‌కు మ‌రియు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఇంఛార్జుల‌కు పంపారు. ఇప్పటికే భారీగా ప్రజాప్రతినిధుల బంధువులు నామినేషన్లు వేశారు. పార్టీ నిర్ణయంతో వైసీపీ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ నిర్ణయంతో నేతలు ఆందోళనలో పడ్డారు.  

See Also | టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తల దాడి…మాచర్లలో టెన్షన్