Vinod Sharma: నరేంద్ర మోదీ మీద బీజేపీ నేతకే నమ్మకం లేదట.. హోర్డింగ్ పెట్టి మరీ రచ్చ

Manipur Violence: వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. విపక్షాల దుమారం ఏమో కానీ, స్వపక్షంలో కూడా ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది. మణిపూర్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక బీజేపీ నేత ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీద నమ్మకం లేదని, పెద్ద హోర్డింగే పెట్టారు. వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన విషయం ఇది.

Pune Horror Case: రూ.40వేల అప్పు చెల్లించలేదని భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసిన షేక్

బీహార్‌ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. బీహార్‌లో ఆయన తన రాజీనామా హోర్డింగ్‌లు పెట్టారు. ఇందులో మణిపూర్ హింసకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, ప్రధాని మోదీలే కారణమని ఆరోపించారు. బీరెన్ సింగ్‌ను తొలగించే ధైర్యం ప్రధాని మోదీకి లేదని వినోద్ పేర్కొన్నారు. అటువంటి నాయకత్వంలో పని చేస్తున్నందుకు నేను స్వీయ స్పృహ మరియు కళంకం కలిగి ఉన్నాను.

Operation Moranchapalli : నీట మునిగిన గ్రామం.. రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు, 70మంది సేఫ్

మణిపూర్‌లోని కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను ఒక గుంపు పట్టపగలు నగ్నంగా ఊరేగించిందని వినోద్ శర్మ ఆరోపించారు. ఈ ఘటన అంతర్జాతీయ వేదికలపై భారత్‌ పరువు తీసిందని ఆయన అన్నారు. మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు వందల సంఖ్యలో జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ చెప్పడంపై శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారమైన మనసుతో బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు. మణిపూర్‌ పరిస్థితి భారత్‌కు చెడ్డపేరు తెచ్చిపెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీలకు వినోద్ శర్మ బీజేపీ లేఖ రాశారు. ఇలాంటి సంఘటన మరెక్కడా జరగలేదని, అప్పుడు కూడా ప్రధాని నిద్రపోతున్నారని, సీఎం బీరెన్‌సింగ్‌ను బర్తరఫ్ చేసే దమ్ము ఆయనకు లేదని అందులో విమర్శలు గుప్పించారు. వినోద్ శర్మ రాజీనామాను బిహార్ లోని అధికార పార్టీ అయిన జేడీయూ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి శర్మ రాజీనామాను పోస్ట్ చేసింది. విపక్షాలు ఆయన రాజీనామాపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.