Amethi 2024: రాహుల్ గాంధీకి అంత దమ్ముంటే, అసలు ఆయన మనిషే అయితే.. అమేథీ ఛాలెంజ్ విసిరిన బీజేపీ

అమేథీ నియోజకవర్గం ఎప్పటి నుంచో గాంధీ కుటుంబానికి కంచుకోట. ఈ స్థానం నుంచి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో వారసత్వ సంపదలుగా ఉన్నాయి. రాహుల్ గాంధీ అయితే అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు

BJP dares Congress leader to announce 2024 bid from Amethi

Amethi 2024: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ చేసిన ‘లాట్కే, జాట్కే’ వ్యాఖ్యల అనంతరం.. రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ ఒక ఛాలెంజ్ విసిరింది. రాహుల్ గాంధీ కనుక మనిషైతే వచ్చే లోక్‭సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాలని బీజేపీ నేత అమిత్ మాల్వియా సవాల్ విసిరారు. ఆయనకు అంత దమ్ముంటే అజయ్ రాయ్ లాంటి సేవకుల వెనుక దాక్కోకూడదని సైతం మాల్వియా అన్నారు. ఈ వ్యాఖ్యలకు ముందు అమేథీ నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.

Modi and Kharge: ‘కుక్క’ వ్యాఖ్యలపై ఓవైపు కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం.. మరోవైపు విందులో సరదాగా గడిపిన మోదీ, ఖర్గే

అమేథీ నియోజకవర్గం ఎప్పటి నుంచో గాంధీ కుటుంబానికి కంచుకోట. ఈ స్థానం నుంచి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో వారసత్వ సంపదలుగా ఉన్నాయి. రాహుల్ గాంధీ అయితే అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోటలో రాహుల్ గాంధీని ఓడించి ఆమె రికార్డు సృష్టించారు.

Nakul Nath Sensational Comments : రాహుల్ భారత్ జోడో యాత్రపై కమల్ నాథ్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు

ఇదే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. సుమారు 7 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. ఇప్పటికి దేశంలో ఇదే అత్యధిక మెజారిటీ. కాగా, వయనాడ్ విజయం ఎలా ఉన్నా అమేథీ ఓటమి మాత్రం రాహుల్‭కు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగానే మారింది. దీన్ని అదును దొరికినప్పుడల్లా బీజేపీ వాడుకుంటోంది. ఇదే తరుణంలో తాజాగా మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు అమిత్ మాల్వియా. మంగళవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘రాహుల్ గాంధీ కనున నిజంగా మనిషే అయితే 2024లో అమేథీ నుంచి పోటీ చేస్తానని ఇప్పుడే ప్రకటించాలి. అజయ్ రాయ్ లాంటి సేవకుల వెనక దాక్కోవడానికి రాహుల్ ప్రయత్నించకూడదు. అలాగే ఒకే సీటు నుంచి పోటీ చేయాలి. రాహుల్ ఈ ఛాలెంజ్‮‭ను స్వీకరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.