Kapil Mishra: సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకపోవడం గొప్పనా? ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత

మామూలు ప్రజల ఆలోచనా విధానం, పరిజ్ణానాన్ని పక్కన పెడితే.. రాజకీయ నాయకులు కూడా సుప్రీం ఆదేశాల్ని సులభంగా తీసి పారేస్తున్నారు. ఢిల్లీలో క్రాకర్లు కాల్చడం పట్ల భారతీయ జనతా పార్టీ నేత కపిల్ మిశ్రా హర్షం వ్యక్తం చేస్తూ సరికొత్త రాజకీయ వివాదానికి తెర లేపారు

SC on Diwali Crackers: ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో నిండా మునిగిపోయి ఉంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో వరుసగా నాలుగో ఏడాది కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో మరింత కాలుష్యం చేసే చర్యలకు ఎప్పుడు మద్దతు ఇవ్వవద్దు. భారత అత్యున్నత న్యాయస్థానం కూడా ఇదే చేసింది. దీపావళి పండగ రోజున పెద్ద ఎత్తున క్రాకర్లు కాల్చుకుండా నిషేధం విధించింది. అయితే సుప్రీం ఆదేశాలను ఖాతరు చేసి చాలా మంది పటాసులు కాల్చారు.

మామూలు ప్రజల ఆలోచనా విధానం, పరిజ్ణానాన్ని పక్కన పెడితే.. రాజకీయ నాయకులు కూడా సుప్రీం ఆదేశాల్ని సులభంగా తీసి పారేస్తున్నారు. ఢిల్లీలో క్రాకర్లు కాల్చడం పట్ల భారతీయ జనతా పార్టీ నేత కపిల్ మిశ్రా హర్షం వ్యక్తం చేస్తూ సరికొత్త రాజకీయ వివాదానికి తెర లేపారు. పటాకుల నుంచి వచ్చిన మెరుపులకు ఆయన రాజకీయ మంటలు రుద్దారు. దీంతో విపక్షాలు ఆయనను టార్గెట్ చేశాయి. రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రధానమైన సుప్రీంకోర్టు మీద అధికార పార్టీకి కనీస గౌరవం కూడా లేదంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆదివారం రాత్రి ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భారీ స్థాయిలో పటాకులు పేలినందుకు, ఢిల్లీ ప్రజలను చూసి గర్వపడుతున్నానని కపిల్ మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ.. ‘‘ఢిల్లీ ప్రజలను చూసి గర్విస్తున్నాను. ఢిల్లీలో పేలిన పటాకులు ప్రతిఘటన, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య స్వరాలు. అశాస్త్రీయ, నియంతృత్వ నిషేధానికి వ్యతిరేకంగా ప్రజలు ధైర్యంగా ఉద్యమిస్తున్నారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చారు. అయితే కపిల్ మిశ్రా తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఆదివారం సాయంత్రం వరకు ఢిల్లీలో వాయు కాలుష్యం(AQI) 218 వద్ద నమోదైంది. ఆ మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం 999కి పెరిగింది. దీంతో ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రజలకు మరోసారి కాలుష్య ముప్పు పెరిగింది.