Bollineni Venkata Ramarao : కచ్చితంగా పోటీ చేస్తా, టీడీపీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారు- బోరున విలపించిన మాజీ ఎమ్మెల్యే

టిక్కెట్టు రానందుకు బాధగా లేదు. చంద్రబాబు చేసిన విధానం నన్ను కలచిచేసింది. కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటా.

  • Updated on- February 29, 2024 / 05:14 PM IST

Bollineni Venkata Ramarao Shocking Comments

Bollineni Venkata Ramarao : నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసంతృప్త గళం భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కనిగిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బొల్లినేని వర్గీయులు భారీగా వచ్చారు. ఉదయగిరి నుంచి తప్పకుండా పోటీ చేస్తానని బొల్లినేని తేల్చి చెప్పారు. ఆత్మీయ సమావేశంలో బోరున విలపించారు బొల్లినేని. టీడీపీ అభ్యర్థి విషయంలో తమకు అన్యాయం జరిగిందని రామారావు అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఉదయగిరి అభ్యర్థి విషయంలో చంద్రబాబు నిర్ణయంతో కలత చెందాను. నాకు టికెట్టు రావడం లేదని తెలిసి చంద్రబాబును అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వలేదు. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డా. టిక్కెట్టు రానందుకు బాధగా లేదు. చంద్రబాబు చేసిన విధానం నన్ను కలచిచేసింది. కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తా. చివరిగా చంద్రబాబుని కలుస్తా. ఏ నిర్ణయం తీసుకున్నా పోటీలో ఉంటా. టీడీపీ పార్టీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా బ్రోకర్లు టిక్కెట్లు ఇప్పిస్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బొల్లినేని రామారావు.

కాగా.. ఉదయగిరి టీడీపీ టికెట్ ను ఎన్ఆర్ఐ కాకర్ల సురేశ్ కు ఇచ్చేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు బొల్లినేని వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Also Read : వైసీపీ జోరు, విపక్షం బేజారు.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..?