రాజమండ్రి: ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. అసంతృప్త నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు,
రాజమండ్రి: ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. అసంతృప్త నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట నర్సింహం అదే బాటలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో తోట నర్సింహంతో బొత్స రహస్య మంతనాలు జరిపారు. వైసీపీలో చేరిక అంశంపై తోట నర్సింహంతో చర్చించినట్లు తెలుస్తోంది. తోట నర్సింహం వైసీపీలోకి వెళ్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బొత్స ఆయనతో భేటీ కావడం చర్చకు దారితీసింది.
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పిన తోట నర్సింహం.. తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యేగా ఉన్నారు. జ్యోతుల నెహ్రు గట్టి పట్టున్న నాయకుడు. ఆయనను కాదని సీఎం చంద్రబాబు జగ్గంపేట టికెట్‌ను తోట భార్యకి ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. జగ్గంపేట సీటు విషయంలో చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాకపోడంతో తోట అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.