ఏపీలో ఈసీ జోక్యం ఎక్కువైంది : చంద్రబాబు ఆగ్రహం

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై మరోసారి సీరియస్ అయ్యారు. ఏపీ విషయంలో, పాలన వ్యవహారాల్లో ఈసీ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర

  • Publish Date - May 2, 2019 / 10:00 AM IST

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై మరోసారి సీరియస్ అయ్యారు. ఏపీ విషయంలో, పాలన వ్యవహారాల్లో ఈసీ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై మరోసారి సీరియస్ అయ్యారు. ఏపీ విషయంలో, పాలన వ్యవహారాల్లో ఈసీ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలన అంశాలతో ఈసీకి ఏం సంబంధం అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో తుపాను సహాయక చర్యల కోసం కొత్త జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను సడలించాలని సీఈసీకి లేఖ రాశామని చంద్రబాబు చెప్పారు. ఇంతవరకు సీఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈసీ వైఖరి ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయంలో కార్యదర్శులతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫొని సూపర్ సైక్లోన్ ముందస్తు చర్యలపై చర్చించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు  లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు సిద్ధం కావాలన్నారు. రెస్క్యూ ఆపరేషన్లకు ప్రత్యేక బృందాలను అందుబాటులో  ఉంచాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని.. తాగునీరు, ఆహార సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు చంద్రబాబు  చెప్పారు. అదే సమయంలో కొందరు అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యసవర అంశాలపై సమీక్షలకు రాకపోవడం కరెక్ట్ కాదన్నారు. అధికారులు జవాబుదారిగా ఉండాల్సింది ప్రభుత్వానికి? ఈసీకా? అని ప్రశ్నించారు.