టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు సీఎం జగన్. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ నాడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అంటే కింద స్థాయి వాళ్లు ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు.
చంద్రబాబు కేటినెట్ లోని మంత్రి దళితుల గురించి చులకనగా మాట్లాడారని..అయినా చంద్రబాబు కనీస చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను ఓట్ల కోసమే వినియోగించుకున్నారని విమర్శించారు. ఓట్ల కోసం కులాలను కూడా చీల్చగల వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన 2003 వరకు చంద్రబాబు రాలేదన్నారు.
నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం వైసీపీ అని తెలిపారు. దళిత మహిళను రాష్ట్ర హోంమంత్రిగా నియమించుకున్నామని తెలిపారు. 82.5 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కోసం విప్లవాత్మకమైన బిల్లు తెస్తున్నామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కోసం రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.