Raja Singh Row: రాజాసింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడే కొట్టండి.. కాంగ్రెస్ నేత వివాదాదస్పద వ్యాఖ్యలు

రాజాసింగ్ వ్యాఖ్యలను ఇస్లాం కమ్యూనిటీ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. హైదరాబాద్‭లోని పలు ప్రాంతాల్లో రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజాసింగ్‭ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పార్టీ నుంచి ఆయనను ఎందుకు తొలగించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్‭కు పంపిన సస్పెన్షన్ నోటీసులోనే పార్టీ పేర్కొంది.

Raja Singh Row: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయంగా పెద్ద దుమారానికి దారి తీసిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్‭ ఎక్కడ కనిపిస్తే అక్కడే కొట్టండంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ మరో వివాదానికి తెరలేపారు. ఇప్పటికే రాజా సింగ్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాజకీయం కుదేలవుతోంది. ఇంతటితోనే ఆగకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని, చాలా సార్లు ఇలా తీసుకోవచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం. ఫిరోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత వరకు తీసుకెళ్తాయో తెలియదు.

ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా ఫిరోజ్ ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ‘‘గ్రూపుల మధ్య గొడవ పెట్టి రాజాసింగ్ రాజాకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆయనను వెంటనే జైల్లో వేయండి. రాజాసింగ్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి. మహ్మద్ ప్రవక్త మా హీరో. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే హైదరాబద్‭లో ఉన్న ప్రతి ఒక్క ముస్లింకు నేను ఒకటే విజ్ణప్తి చేస్తున్నాను. రాజాసింగ్ ఎక్కడ కనిపించినా అక్కడే కొట్టండి. మనం చట్టాన్ని ఒకేసారి కాదు చాలాసార్లు చేతుల్లోకి తీసుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

రాజాసింగ్ వ్యాఖ్యలను ఇస్లాం కమ్యూనిటీ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. హైదరాబాద్‭లోని పలు ప్రాంతాల్లో రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజాసింగ్‭ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పార్టీ నుంచి ఆయనను ఎందుకు తొలగించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్‭కు పంపిన సస్పెన్షన్ నోటీసులోనే పార్టీ పేర్కొంది.

Bilkis Bano case: బిల్కిస్ బానో నిందితుల విడుదల తప్పిదం: సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత విమర్శలు

ట్రెండింగ్ వార్తలు