కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు సొంత పార్టీ నేతలు. ఆరోపణలు వస్తే… నిరూపించుకోవాల్సింది పోయి… ఇతరులపై నిందలేయడం ఏంటని రేవంత్‌ను సీనియర్లు కడిగి పారేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు సొంత పార్టీ నేతలు. ఆరోపణలు వస్తే… నిరూపించుకోవాల్సింది పోయి… ఇతరులపై నిందలేయడం ఏంటని రేవంత్‌ను సీనియర్లు కడిగి పారేశారు. వ్యక్తిగతం అంశాలను.. పార్టీకి అంటగట్టాలని రేవంత్ చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పార్టీలో చర్చించకుండా ఎలా సమర్థిస్తారంటూ.. సీనియర్ నేత వీహెచ్ విమర్శిస్తే.. తక్షణం కోర్ కమిటీ ఏర్పాటు చేసి.. రేవంత్ వ్యవహారాన్ని తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.
రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలో భూదందాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి.. దాన్నుంచి తప్పించుకోవడానికే జీవో 111ను తెరపైకి తెచ్చారంటూ కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి.. దాన్ని దాటవేస్తూ.. ఇంకొకరిపై నిందలు వేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా.. ఆ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించడంపైనా కన్నెర్ర చేస్తున్నారు.
ట్రిపుల్ వన్ జీవో నిబంధనలు ఉల్లంఘించి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించారంటూ రేవంత్‌రెడ్డి విమర్శలు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నాయి. అనుమతి లేకుండా ప్రైవేటు నివాసాన్ని డ్రోన్లతో వీడియో తీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేయడం, రేవంత్ జైలుకు వెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి.
రేవంత్ అరెస్టు అక్రమమంటూ కాంగ్రెస్‌లో కొందరు నేతలు ఖండించారు. కానీ… సీనియర్లు మాత్రం రేవంత్‌పై సీరియస్ అవుతున్నారు. కాంగ్రెస్‌లో ఫ్రీడమ్ ఎక్కువగానే ఉంటుంది. ఎవరు ఎవరినైనా విమర్శించొచ్చు. కానీ… ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తే మాత్రం బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి విషయంలోనూ ఎదురైందంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు.
తనపై ఆరోపణలు వస్తుంటే… వాటిని ఎదుర్కోవాల్సింది పోయి… ఎదుటివారిపై అవాకులు చవాకులు పేలడంపై సీనియర్లు మండిపడుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందిపోయి… పార్టీ ఎజెండాగా మార్చడానికి రేవంత్ ఎలా ప్రయత్నిస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. గోపనపల్లి భూముల వ్యవహారాన్ని ఎదుర్కోలేకే తెరపైకి ట్రిపుల్ వన్ జీవో అంశాన్నిర రేవంత్ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ట్రిపుల్ వన్ పరిధిలో కాంగ్రెస్ వాళ్లవే ఎక్కువ నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు వీహెచ్.
వీహెచ్ ఒక్కరే కాదు… మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం రేవంత్ తీరును తప్పుబట్టారు. రేవంత్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టారని మండిపడ్డారు జగ్గారెడ్డి. ట్రిపుల్ వన్ జీవో అసలు సమస్యే కాదన్నారు. రేవంత్ వ్యవహారాన్ని తేల్చడానికి తక్షణం కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. 111 జీవోకు, పీసీసీ పదవికి లింక్ పెట్టి చేస్తున్న ఫేస్‌బుక్‌లో రేవంత్ అనుచరులు చేస్తున్న ప్రచారంపైనా చర్చించాలని పట్టుబడుతున్నారు.
మరో సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా రేవంత్ తీరుని తప్పుబట్టారు. రేవంత్ లేవనెత్తిన అంశం కంటే ముఖ్యమైన సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, భూ వివాదాలేవైనా ఉంటే కోర్టుల్లో తేల్చుకోవచ్చంటూ చురకలంటించారు.
See Also | బీజేపీ-జనసేన పొత్తు ఓటర్లను ఆకర్షిస్తుందా… నేడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల