Sharad Pawar: మొన్న అలా, ఈరోజు ఇలా.. శివసేన విషయంలో ఈ నిర్ణయంపై శరద్ పవార్ డబుల్ కామెంట్స్

తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు పార్టీ తనకు చెందుతుందని ఎలాంటి క్లెయిమ్ చేయలేదని పవార్ గుర్తు చేశారు. కానీ తాజా పరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే అన్యాయం జరిగిన పార్టీ వైపే ప్రజలు ఉంటారని అన్నారు

Sharad Pawar: శివసేన పార్టీ మీద కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తాజాగా స్పందించారు. పార్టీ పేరు, ‘విల్లు-బాణం’ గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. గతంలో ఎన్నికల సంఘం ఎప్పుడూ ఇలా నిర్ణయం తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఉద్ధవ్ థాకరేతో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన ఉద్ధవ్ వర్గానికి మద్దతుగా నిలిచిరు. ఉద్ధవ్ థాకరేకు ప్రజల మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈసీఐ నిర్ణయం వెలువడిన మర్నాడు (శనివారం) పవార్ మరో విధంగా స్పందించారు.

Supreme Court: ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ పై ఏక్ నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు

నిర్ణయం ఏదైనా జరిగిపోయినట్టే కాబట్టి, ఆ నిర్ణయాన్ని అంగీకరించి కొత్త గుర్తును తీసుకోవాలని ఉద్ధవ్ థాకరేకు సూచించారు. కానీ నాలుగు రోజుల అనంతరం ఈసీ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఉద్ధవ్‭కు మద్దతుగా నిలవడం గమనార్హం. ఈవిషయమై పవార్ స్పందిస్తూ ”రాజకీయ అంసతృప్తులు, విభజనలు అనేవి ఏ పార్టీలోనైనా ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. అయితే పార్టీని, పార్టీ గుర్తును స్వాధీనం చేసుకోవడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. దీనిపై తీర్పులిచ్చే అధికారం నిజంగా ఈసీకి ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది” అని పవార్ అన్నారు.

Sadhvi Prachi: స్వర భాస్కర్ వివాహంపై వీహెచ్‭పీ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు

తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు పార్టీ తనకు చెందుతుందని ఎలాంటి క్లెయిమ్ చేయలేదని పవార్ గుర్తు చేశారు. కానీ తాజా పరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే అన్యాయం జరిగిన పార్టీ వైపే ప్రజలు ఉంటారని అన్నారు. తాను ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నానని, ఉద్ధవ్ థాకరేకు ప్రజల మద్దతు ఉన్నట్టు ఈ పర్యటనలో చాలా స్పష్టంగా తేలిందని పవార్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు