చంద్రబాబు షాక్ : డేటా కేసులో కీలక సాక్ష్యం నా దగ్గర ఉంది

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ

  • Publish Date - March 9, 2019 / 05:16 AM IST

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటాను చోరీ చేసిన దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ వేసిన యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటున్నారని, కానీ ఎక్కడో ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారని చెప్పారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని సీఎం చెప్పారు. శనివారం(మార్చి 9) మధ్యాహ్నం 1 గంటకు ఆ వివరాలు వెల్లడిస్తా అన్నారు. డేటా చోరీ చేశామని తమపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల తాట తీస్తానని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Read Also : ఎలక్షన్ ఫీవర్ : జగన్ పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు

చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు దగ్గరున్న సాక్ష్యం ఏంటి? దాని గురించి ఆయన ఏం చెబుతారు? వైసీపీ, టీఆర్ఎస్‌ని ఎలా టార్గెట్ చేయబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. డేటా చోరీ వివాదం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఏపీ ప్రజల డేటాను దుర్వినియోగం చేశారని వైసీపీ, టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. తమ డేటాను టీఆర్ఎస్ సాయంతో వైసీపీ దొంగిలించిందని టీడీపీ ఎదురు దాడి చేస్తోంది.

ఈ కేసులో ఎంత పెద్దవాళ్లున్నా వదిలేది లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. డేటా చోరీ కేసు వ్యవహారంలో ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ను కూడా ఏర్పాటు చేసింది. కాగా, తాము ఎలాంటి డేటా దుర్వినియోగానికి పాల్పడలేదని, వ్యాపారపరమైన లావాదేవీలు మాత్రమే చేసినట్టు ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్‌ చెబుతున్నారు.
Read Also : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు.. ‘జెట్ బ్లూ’ బంపర్ ఆఫర్