గుంటూరు బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏకి పారేశారు. కుటుంబ పాలన వద్దని సొంతగా పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఆశయాలను లెక్కచేయట్లేదంటూ దుమ్మెత్తిపోశారు. ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని లోకేశ్‌ను వృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఢిల్లీకి ఫొటోలు దిగడానికే వెళ్లారని విమర్శించారు. మోడీ తాను ఢిల్లీ వెళితే మళ్లీ అధికారంలోకే వెళ్తాననే గుర్తు చేశారు.
ధర్మ పోరాట దీక్షకు చంద్రబాబు పెడుతున్న ఖర్చుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారా లేదా అనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఢిల్లీకి ఫొటోలు దిగడానికే వెళ్తున్నారని తాను ఢిల్లీ వెళ్తే మళ్లీ అధికారంలో ఉంటానని బాబుకు గుర్తు చేశారు.