Cm Revanth Reddy: కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేలా రేవంత్ సర్కార్ సరికొత్త స్కెచ్..! ఏంటా వ్యూహం..
పాయింట్ టు పాయింట్..ఎవ్రీ మిస్టేక్‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ..రిపోర్ట్ ఏంటి..జరిగిన నష్టమేంటి.? (Cm Revanth Reddy)

Cm Revanth Reddy: పాలిటిక్స్ ఈజ్ ఆల్ వేస్ టైమింగ్. ఏ టైమ్‌లో ఏ అంశాన్ని అడ్వాంటేజ్‌గా మలుచుకుంటే..అంత మైలేజ్ వస్తుంది. ఇలాంటి ప్లాన్స్ వేయడంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. కానీ ఈసారి దళపతి ఎత్తులకు పైఎత్తులు వేస్తోందట అధికార కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్‌ను.. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌తో ఇరకాటంలో పెట్టేలా స్కెచ్ వేస్తోందట సర్కార్.
త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందట. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి..కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చ పెట్టాలని..కేసీఆర్ వల్లే లక్ష కోట్లు వృథా అయ్యాయని చెప్పాలని ప్లాన్ చేస్తోందట. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో కాళేశ్వరం టాపిక్‌ను అస్త్రంగా వాడుకోవాలనేది హస్తం పార్టీ వ్యూహమట.
అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుంది?
అసెంబ్లీ సమావేశాలను ప్రతీ 6 నెలలకు ఒకసారి పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా సెప్టెంబర్ 30కి 6 నెలల గడువు ముగుస్తోంది. దాంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 30లోపు కచ్చితంగా నిర్వహించాలి. అందుకు అనుగుణంగా ఆగస్ట్ 10న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు..ఎలా నిర్వహిస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుందనే దానిపై రేవంత్ సర్కార్ సమాలోచనలు చేస్తోందట.
ఫైనల్‌గా సభాపర్వాన్ని నిర్వహించే సమయంపై ఫిక్స్ అయ్యారట. త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైందట. ఆగస్ట్ మూడో వారంలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని అంటున్నారు. షెడ్యూల్ వచ్చాక ఆగస్ట్ చివరిలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని కసరత్తు చేస్తోందట సర్కార్.
పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది కాంగ్రెస్ ప్లాన్..!
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పైనే చర్చ జరగనుంది. రిపోర్ట్‌ను బేస్ చేసుకొని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను చెడుగుడు ఆడాలని ప్లాన్ చేస్తున్నారట సర్కార్ పెద్దలు. కాళేశ్వరం రిపోర్ట్‌తో ప్రతిపక్షాన్ని ఫుల్ డ్యామేజ్ చేసి..లోకల్ బాడీ పోల్స్‌లో తమకు పోటీనే లేకుండా..పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది కాంగ్రెస్ ప్లాన్ అంటున్నారు.(Cm Revanth Reddy)
అసెంబ్లీ నుంచే అపోజిషన్‌పై దాడి..!
పలువురు మంత్రులు అపోజిషన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. పాయింట్ టు పాయింట్..ఎవ్రీ మిస్టేక్‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ..రిపోర్ట్ ఏంటి..జరిగిన నష్టమేంటి.? కేసీఆర్ నిర్ణయాలతో జరిగిన డ్యామేజ్ ఎంత అనేదానిపై ప్రతిపక్షాన్ని పూర్తిగా ఇరుకున పెట్టేలనుకుంటున్నారట.
మామూలుగానే అసెంబ్లీ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని..లోకల్ బాడీ ఎన్నికల కోసం..అసెంబ్లీ నుంచే అపోజిషన్‌పై దాడి స్టార్ట్ చేయాలని భావిస్తోందట. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ సెషన్‌ను లోకల్ బాడీ ఎన్నికల ప్రచార అస్త్రం మలుచుకోవాలనేది కాంగ్రెస్ పెద్దల ప్లాన్ అని టాక్.
మరోవైపు ఈసారి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్‌ఎస్‌లో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే లీడర్లకు ఉచ్చు బిగియడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కేటీఆర్‌ను ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఈసారి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ను అరెస్ట్ చేసి..అసెంబ్లీలో పూర్తిగా అప్పర్ హ్యాండ్ సాధించాలని చూస్తోందట కాంగ్రెస్ సర్కార్.
కేసీఆర్ ఎలాగూ సభకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక హరీశ్‌రావును కట్టడి చేసి సభను పూర్తిగా తాము అనుకున్నట్లుగా నడిపించి..పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది హస్తం పార్టీ పెద్దల వ్యూహమంటున్నారు. కాంగ్రెస్ ప్లాన్ లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో..సర్కార్ ఎత్తులకు బీఆర్ఎస్ కౌంటర్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.(Cm Revanth Reddy)