అనంతపురం : హిందూపురం టీడీపీలో అసమ్మతి సెగ రగిలింది. బాలకృష్ణ నాయకత్వాన్ని అసమ్మతి వర్గం విభేదిస్తోంది. అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు పలువురు సీనియర్ నాయకులు అసమ్మతితో ఉన్నారు. ఈ మేరకు వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి టీడీపీలో గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబికా లక్ష్మీనారాయణకు హిందూపురం ఎంపీ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.
హిందూపురం టీడీపీకి పుట్టినిల్లు లాంటింది. టీడీపీ స్థాపించినప్పుడు హిందూపురం నుంచి ఎన్ టీఆర్ పోటీ చేశారు. ఆ తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ పోటీ చేసి గెలిచారు. అయితే ఎప్పుడు లేని అసమ్మతి ఈ ఐదేళ్లలో హిందూపురం టీడీపీలో నెలకొంది. పార్టీ కోసం పని చేసినా గుర్తింపు లేదని వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, పలువురు జెడ్ పీటీసీ, ఎంపీటీసీలు వాపోతున్నారు. తమకు పదవులు ఇస్తామని చెప్పి…ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. ఈసారి కచ్చితంగా హిందూపురం ఎంపీ స్థానాన్ని అంబికా లక్ష్మీనారాయణకే కేటాయించాలని.. తమ మద్దతు టీడీపీకి ఉంటుందో..లేదో సీటు కేటాయింపు తర్వాత చెబుతామని అసమ్మతి నేతలు అంటున్నారు.