నా హత్యకి కుట్ర : దర్యాఫ్తుకి ఆదేశించాలని ఈసీకి హర్షకుమార్ విజ్ఞప్తి

అమరావతి : తన హత్యకు ఎవరో కుట్ర చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. తన కారు ముందు చక్రం బోల్ట్ లు తీసేసి ఉన్నాయని చెప్పారు. దీనిపై తాను కేసు పెడితే 3

  • Publish Date - April 17, 2019 / 12:11 PM IST

అమరావతి : తన హత్యకు ఎవరో కుట్ర చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. తన కారు ముందు చక్రం బోల్ట్ లు తీసేసి ఉన్నాయని చెప్పారు. దీనిపై తాను కేసు పెడితే 3

అమరావతి : తన హత్యకు ఎవరో కుట్ర చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. తన కారు ముందు చక్రం బోల్ట్ లు తీసేసి ఉన్నాయని చెప్పారు. దీనిపై తాను కేసు పెడితే 3 రోజులు దర్యాఫ్తు చేసిన పోలీసులు సడెన్ గా ఆపేశారని హర్షకుమార్ చెప్పారు. దీనిపై ఆయన సీఈవో ద్వివేదిని కలిశారు. తన కేసుపై దర్యాఫ్తుకు ఆదేశించాలని సీఈవోని కోరారు. ఐదేళ్లుగా ఏ పార్టీలో లేకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశానని హర్షకుమార్ చెప్పారు. దీంతో టీడీపీ ప్రభుత్వం తనను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని వాపోయారు. 42 సార్లు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు.

తన కారు టైరు బోల్టులు తీసేసిన ఘటన షో రూమ్ లోనే జరిగి ఉండొచ్చని హర్షకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. తన హత్యకు ప్లాన్డ్ గా స్కెచ్ వేశారన్నారు. తనకు శత్రువులు కూడా ఎవరూ లేరని అన్నారు. దీనిపై పోలీసులు దర్యాఫ్తు జరపాలని, తన హత్యకు ప్లాన్ చేసిన వారిని పట్టుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం ఇటీవల టీడీపీలో చేరానని చెప్పారు. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మోసం చెయ్యడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చానని అన్నారు.

ఇంటర్మీడియట్‌ కాలేజీల్లో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని హర్షకుమార్‌ మండిపడ్డారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ అనే పదం ఎక్కడా లేదని, కాలేజీల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఇంటర్ ఫీజులపై న్యాయపోరాటం చేస్తున్నానని, హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ప్రభుత్వం నిర్దారించిన ఫీజు కేవలం రూ.2,800 మాత్రమేనని, ప్రోత్సాహకం పేరుతో ప్రభుత్వం 35 వేల ఫీజు కొంతమందికి ఎలా చెల్లిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.