Kalyandurg TDP : కల్యాణదుర్గం టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. ఎమ్మెల్యే అభ్యర్థి ఫ్లెక్సీలు చించివేత

మరి, కల్యాణదుర్గం టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయంలో మార్పు ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠ మొదలైంది.

  • Updated on- March 3, 2024 / 10:39 PM IST

Clashes In Kalyandurg TDP

Kalyandurg TDP : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. ముద్దినాయనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్ర బాబు ఫ్లెక్సీలను టీడీపీ ఇంఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు వర్గం చించివేసింది. తమ నాయకుడినే అభ్యర్థిగా ప్రకటిస్తారని, సురేంద్రబాబు ఫ్లెక్సీలను కట్టవద్దంటూ ఉమా వర్గం హెచ్చరించింది. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. లోకల్ నాయకుడినే అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

కాంట్రాక్టర్ సురేంద్ర బాబుకు సహకరించము అంటూ తేల్చి చెప్పింది వ్యతిరేక వర్గం. మరి, కల్యాణదుర్గం టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయంలో మార్పు ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠ మొదలైంది.

Also Read : Nellore District Political Scenario : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?