Hardik Patel Acquitted In 5-Year-Old Case Of Disobeying Government Order
Hardik Patel: అధికారులు నిర్దేశించిన షరతులను ఉల్లంఘించి ఒక సభలో రాజకీయ ప్రసంగం చేశారన్న ఆరోపణలపై ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, పాటీదార్ నేత హార్దిక్ పటేల్‌కు ఊరట లభించింది. ఈ కేసులో శుక్రవారం తుది విచారణ విన్న జామ్‌నగర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. వాదనల అనంతరం హార్దిక్‌ను నిర్ధోషిగా ప్రకటించింది. ఈయనతో పాటు మనీష్ నందానీ, అంకిత్ ఘడియాలకు కూడా అన్ని కేసుల నుంచి విముక్తి లభించింది. ప్రాసిక్యూషన్ ఎటువంటి సందేహం లేకుండా తన కేసును నిర్ధారించడంలో విఫలమైందని, ఇప్పుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఫిర్యాదుదారుకు కూడా అన్ని వివరాలు తెలియవని తీర్పులో కోర్టు పేర్కొంది.
Adani Group: హిండెన్‌బర్గ్‌తో పోరాటానికి అమెరికాలోని టాప్ న్యాయ కంపెనీలను నియమించుకున్న అదానీ
జామ్‌నగర్ ‘ఎ’ డివిజన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) బ్యానర్‌పై పాటిదార్ కోటా ఆందోళనకు నాయకత్వం వహించిన పటేల్ జామ్‌నగర్‌లోని ధుతార్‌పూర్ గ్రామంలో జరిగిన ర్యాలీలో రాజకీయ ప్రసంగం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనంతరం ఒక నెల తర్వాత నవంబర్ 4, 2017న ఈ ప్రసంగం జరిగింది. ర్యాలీకి అనుమతి ఇచ్చిన షరతులను ఉల్లంఘిస్తూ హార్దిక్ పటేల్ రాజకీయ ప్రసంగం చేశారనే ఆరోపణల నడుమ, హార్దిక్‌తో పాటు జామ్‌నగర్‌కు చెందిన ఘడియాపై గుజరాత్ పోలీసు చట్టంలోని 36(ఎ), 72(2), 134 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Mallikarjun Kharge: విపక్షాలు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పని ప్రధాని మోదీ
ఇక గత అసెంబ్లీ ఎన్నికల (2017) సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హార్దిక్ పటేల్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కమల తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం బీజేపీ టికెట్ మీద అహ్మదాబాద్‌లోని విరామ్‌గామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.