హర్షకుమార్‌కు తప్పిన ప్రమాదం : కారు టైరు బోల్టులు తీసేశారు

రాజమహేంద్రవరంలో కలకలం చెలరేగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు టైరు బోల్టులు దుండగులు తీసేశారు. సకాలంలో ఈ

  • Publish Date - March 23, 2019 / 02:59 PM IST

రాజమహేంద్రవరంలో కలకలం చెలరేగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు టైరు బోల్టులు దుండగులు తీసేశారు. సకాలంలో ఈ

రాజమహేంద్రవరంలో కలకలం చెలరేగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు టైరు బోల్టులు దుండగులు తీసేశారు. సకాలంలో ఈ విషయాన్ని గుర్తించడంతో హర్షకుమార్ కు ఘోర ప్రమాదం తప్పింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు టైరు బోల్టులు తొలగించడం దుమారం రేపింది. హర్షకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

4 రోజుల కిందట(మార్చి 19, 2019) చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన హర్షకుమార్.. 4 రోజుల వ్యవధిలోనే (శుక్రవారం, మార్చి 22) ఆ పార్టీకి రిజైన్ చేశారు. పోతూపోతూ టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకే అమలాపురం ఎంపీ టిక్కెట్ దక్కుతుందని భావించినా.. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్‌కు చంద్రబాబు టిక్కెట్ కేటాయించారు. దీంతో హర్షకుమార్ మనస్తాపం చెందారు. టీడీపీ ఎస్సీలను మోసం చేసిందని హర్షకుమార్ ఆరోపించారు. అందుకే తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తాను మెడలో వేసుకున్న టీడీపీ కండువాను విసిరి కొట్టారు. పసుపురంగు కండువా తనకు బరువుగా ఉందని, ఆ భారాన్ని తాను మోయలేనని చెప్పారు.

పవన్ కల్యాణ్, జగన్‌పై కూడా ఆయన మండిపడ్డారు. గతంలో తనను కలిసి మాట్లాడతానని చెప్పిన జనసేన అధినేత పవన్‌ కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన రెండూ ఒక్కటేనని, పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను టీడీపీ ఫిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీకి ఓటేస్తే టీఆర్ఎస్, బీజేపీలకు వేసినట్లేనని చెప్పారు. ఎన్నికల తర్వాత తాను సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ఎస్సీల కోసం పోరాడతానని హర్షకుమార్ చెప్పారు.