జగన్ ఊ.. అంటే.. టీడీపీ ఖాళీ : మంత్రి అవంతి

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై

  • Publish Date - December 12, 2019 / 06:29 AM IST

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ప్రవర్తించడం లేదన్నారు. టీడీపీ నేతలు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపూ జగన్ ని, వైసీపీ సభ్యులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబుపై సీరియస్ అయ్యారు.

చంద్రబాబు రాజధాని పర్యటనకు వస్తే తనకు వైస్రాయ్ ఎపిసోడ్ గుర్తొచ్చిందని మంత్రి అవంతి అన్నారు. గతంలో చంద్రబాబు చెప్పులు వేయించారని, ఇప్పుడు అది చంద్రబాబుకే జరిగిందని అవంతి అన్నారు.మీడియా గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.

చంద్రబాబు హయాంలో మీడియా పట్ల ఎంత వివక్ష చూపారో అందరికీ తెలుసన్నారు. ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే.. నువ్వు సాక్షినా.. బయటికి వెళ్లు..అని పంపేశారని అవంతి వాపోయారు. నాడు మీడియాపై వివక్ష చూపిన చంద్రబాబు.. ఇవాళ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. సభలో చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ కానీ, మాటలు కానీ ఏ మాత్రం బాగోలేవన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారని.. ఇప్పుడు టీడీపీకి 23మంది మాత్రమే మిగిలారని అవంతి గుర్తు చేశారు. ఇవాళ సభకు సగం మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాడం లేదన్నారు. సీఎం జగన్.. ఊ.. అంటే.. 23మంది ఎమ్మెల్యేలలో 80శాతం వైసీపీలోకి వచ్చేస్తారని.. టీడీపీ ఖాళీ అవుతుందని మంత్రి అవంతి హెచ్చరించారు. సీఎం జగన్ ను ఉన్మాది అంటూ చంద్రబాబు తప్పుగా మాట్లాడారని, ఆ మాటను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని అవంతి డిమాండ్ చేశారు.