Bihar Politics: ఠాకూర్ వర్గంపై రాజసభ్యలో వ్యాఖ్యలు.. సొంత పార్టీ నుంచే నాలుక కోస్తామంటూ బెదిరింపులు

అవును సార్.. మేము 'ఠాకూర్'!! మేము అందరినీ ముందుకు తీసుకెళ్తాం. చరిత్రలో గరిష్ట త్యాగం చేసాము. సోషలిజం పేరుతో ఏదైనా ఒక కులాన్ని టార్గెట్ చేయడం కపటత్వం తప్ప మరొకటి కాదు. మేము మీపై ప్రారంభిస్తే.. ఆ అసభ్యకరమైన వ్యాఖ్యలను మీరు సహించరు

Manoj Kumar Jha: రాజ్యసభ వేదికగా రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝా చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐఏఎస్ అధికారి హత్య కేసులో సుధీర్ఘకాలం జైలులో ఉండి కొద్ది రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన ఆనంద్ మోహన్ అయితే నాలుక చీరేస్తా అంటూ హెచ్చరిస్తున్నారు. అంతకు ముందు ఆయన కుమారుడు సైతం మనోజ్ ఝాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాకూర్ కమ్యూనిటీని ఏదో ఒకటి అనడం ప్యాషన్ అయిపోయిందని ఆనంద్ కుమార్ కుమారుడు చేతన్ ఆనంద్ అన్నారు.

వివాదం ఏంటి?
రాజ్యసభలో మనోజ్ ఝా మాట్లాడుతూ ఠాకూర్ కమ్యూనిటీ మీద విమర్శలు చేశారు. భూములు, నీళ్లు అన్నీ ఠాకూర్ కమ్యూనిటీ వద్దే ఉంటాయని, వెనుకబడిన కులాల శ్రమంతా వారి హవేలికి వెళ్తోందంటూ ఒక హిందీ కవి రాసిన పద్యాన్ని రాజ్యసభలో వినిపించారు. అయితే దీనిపై ఆనంద్ మోహన్ కుమారుడు చేతన్ మోహన్ తొలుత స్పందించారు. చేతన్ ఆనంద్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘‘” అవును సార్.. మేము ‘ఠాకూర్’!! మేము అందరినీ ముందుకు తీసుకెళ్తాం. చరిత్రలో గరిష్ట త్యాగం చేసాము. సోషలిజం పేరుతో ఏదైనా ఒక కులాన్ని టార్గెట్ చేయడం కపటత్వం తప్ప మరొకటి కాదు. మేము మీపై ప్రారంభిస్తే.. ఆ అసభ్యకరమైన వ్యాఖ్యలను మీరు సహించరు’’ అని మనోజ్ కుమార్ ఝా పేరు ఎత్తకుండా విమర్శలు గుప్పించారు.

Ramesh Bidhuri: బీఎస్పీ ఎంపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరికి ఉన్నత బాధ్యతలు

ఇక ఝా వ్యాఖ్యలపై ఆనంద్ మోహన్ స్పందిస్తూ.. నాలుక కోస్తానంటూ వ్యాఖ్యానించారు. ఆనంద్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆనంద్ మోహన్ తుపాకీ పట్టుకుని సొంత ప్రభుత్వంపైనే యుద్ధం చేశాడు. ఆ సమయంలో (మనోజ్ ఝా కవిత చెప్పిన సమయంలో) నేను రాజ్యసభలో ఉండి ఉంటే ఠాకూర్‌పై వ్యాఖ్యానించిన వ్యక్తి నాలుక బయటకు తీసి సీటుపై విసిరేవాడిని. ఈ అవమానాన్ని సహించేది లేదు. మేము జిందా కమ్యూనిటీ ప్రజలం. మహిళా బిల్లుపై సభలో చర్చ జరుగుతుండగా ఠాకూర్ మాట్లాడుతున్నారు. కళ్ళు ఒక చోట, లక్ష్యం మరొక చోట ఉంది. నువ్వు అంత పెద్ద సోషలిస్టు అయితే నీ పేరు మీద టైటిల్ ఎందుకు పెట్టావు?’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మనోజ్ ఝా ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలి
ఇక ఆర్జేడీ మిత్రంపక్షమైన జనతాదళ్ యూనియన్ నుంచి కూడా మనోజ్ కుమార్ ఝాకు మందలింపు వచ్చింది. జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ మనోజ్ ఝా ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. కులానికి, మతానికి వారధిగా పని చేస్తున్నామని, అయితే ఇలాంటి విచ్ఛిన్నం చేసే పని చేస్తున్నారంటూ ఝాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేము బ్రాహ్మణులను గౌరవిస్తాము. వారిని కౌగిలించుకుంటాం. వారి పాదాలను తాకండి. మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదని నా అభిప్రాయం. మేము మా చేతుల్లో కంకణాలు ధరించడం లేదు. కాబట్టి అనియంత్రిత ప్రకటనలకు దూరంగా ఉండాలి’’ అని సంజయ్ సింగ్ అన్నారు.

మనోజ్ కుమార్ ఝాకు మద్దతు కూడా లభిస్తోంది. ఆయనేమీ తప్పుగా చెప్పలేదని, సమాజంలో ఉన్న వాస్తవాన్ని గుర్తు చేశారని సొంత పార్టీ నేత శక్తి సింగ్ అన్నారు. నెట్టింట్లో కూడా మనోజ్ కుమార్ ఝాకు మద్దతుగా అనేక మంది స్పందిస్తున్నారు.

ISKON: ఇస్కాన్‭కు వివాదాలు కొత్తేం కాదు? 1965లో ఆ సంస్థ ప్రారంభమైన నాటి నుంచి చరిత్ర చూస్తే ఆశ్చర్యపోతారు