చంద్రబాబు పాలనలో తాగు, సాగునీరు లేదు : జగన్  

చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.

  • Publish Date - March 24, 2019 / 08:32 AM IST

చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.

గుంటూరు : చంద్రబాబు పాలనలో తాగు, సాగు నీరు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు. రేపల్లెలో రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయిన్నారు. చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆక్వా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. పంటసాగు చేతికొచ్చే సమయానికి దళారులు ఏకమై దోచుకుంటున్నారని మండిపడ్డారు. రేపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు. 

అన్నంపెట్టే రైతు ఆకలితో అలమటిస్తుంటే ఎవరు ఆదుకుంటారని వాపోయారు. వడ్డీలకే చాలని రుణమాఫీ చేశారని ఎద్దేవా చేశారు. చివరికి రెండు విడతల రుణమాఫీ ఎన్నికల సమయంలో వచ్చే అవకాశం లేదన్నారు. ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు తన మాఫియాను పెట్టారని ఆరోపించారు. తన హెరిటేజ్ అభివృద్ధి కోసం రైతులను కష్టాలపాలు చేశారన్నారు. 

పాదయాత్రలో రైతన్న కష్టాలు చూశాను, బాధలు విన్నానని చెప్పారు. రాష్ట్రంలో నవరత్నాలతో రైతుల పండుగ చేస్తానని తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కింద రూ.50 వేల ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతు చేతిలో పెట్టే బాధ్యత తనదేనని చెప్పారు. రైతు కట్టే బీమా ప్రభుత్వమే కుడుతుందన్నారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర రూ.1.5 కే ఇస్తానని తెలిపారు. ప్రతి రైతన్నకు గిట్టుబాటు ధర ఇస్తానని భరోసా ఇచ్చారు.