విజయవాడలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అయింది.
కృష్ణా : విజయవాడలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన భేటీ అయింది. రానున్న ఎన్నికల్లో గెలుపు లక్ష్యం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు, బహిరంగ సభలపై చర్చించనున్నారు. పార్టీ గుర్తుపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
అనంతరం జనసేన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేయాలన్న అంశంపై కూడా చర్చ జరుగనుంది. అలాగే స్టీరింగ్ కమిటీ విధి విధానాలను ఫైనల్ చేసే అవకాశం ఉంది.