కరీంనగర్‌లో ఎన్నిక నగారా : కార్పొరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్
- madhu
- Published On : January 9, 2020 / 03:25 PM IST
కరీనంగర్ కార్పొరేషన్ ఎన్నికకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. హైకోర్టు తీర్పుతో 2020, జనవరి 09వ తేదీ గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. రిజర్వేషన్లు (జనరల్ కోటా)ను ఖరారు చేశారు. మేయర్ పదవి జనరల్ కోటా కిందకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఉదయం 10.30గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు జనవరి 14వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి, ఉప ఎన్నికల అధికారి వద్ద అప్పీల్ చేసుకొనేందుకు ఎన్నికల సంఘం ఛాన్స్ కల్పించింది. జనవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అప్పీళ్ల పరిష్కారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం తుది జాబితా ఖరారు చేసి గుర్తులు కేటాయిస్తారు.
* 2020, జనవరి 09వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.
* 2020, జనవరి 13వ తేదీన నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 14న అప్పీల్ చేసుకొనే ఛాన్స్.
* 2020, జనవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్.
* 2020, జనవరి 24వ తేదీన పోలింగ్.
* 2020, జనవరి 27వ తేదీన కౌంటింగ్.
Read More : ఆదాయాన్ని వారసులకు ఇవ్వను – వెంకయ్య నాయుడు
