Like Taliban, RSS and BJP are…: Kharge
Mallikarjun Kharge: భారతదేశంలో తాలిబన్ లాంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. అఫ్గానిస్తాన్ దేశంలో మహిళలకు తాలిబన్ ప్రభుత్వం విద్యను నిషేధించింది. అయితే బీజేపీ మనుస్మృతి ఆధారంగా పాలన సాగిస్తోందని, దాని ప్రకారం కూడా మహిళలకు విద్యను నిషేధించడమేనని, తాలిబన్ పాలన – బీజేపీ పాలన ఒకటేనని ఆయన విమర్శలు గుప్పించారు.
Student Stabbed Teacher : పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి
కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల ఎగ్జిక్యూటివ్ సమావేశల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ఏ రోజు రైతుల కోసం కన్నీళ్లు కార్చలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు బయటికి వెళ్తుంటే కన్నీళ్లు కార్చారు. ఆ నాయకుడి పేరు నేను చెప్పను. కానీ మీకందరికీ తెలుసు’’ అని అన్నారు. 2021లో రాజ్యసభ నుంచి గులాం నబీ ఆజాద్ రిటైర్ అయ్యే సమయంలో పార్లమెంటులో మాట్లాడుతూ మోదీ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో బీజేపీ నేతల్లో ఒనుకు పుట్టిందని, ఎన్నికలను మాత్రమే లెక్క వేసుకునే బీజేపీకి ఇలాంటి భయాలు సహజమేనని ఖర్గే విమర్శించారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని రావణుడితో పోల్చడంపై స్పందిస్తూ, ఆర్ఎస్ఎస్ పుస్తకాల్లో తన గురించి ఏం రాసినా పట్టించుకోనని అన్నారు. దేశంలోని స్వతంత్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని విమర్శించిన ఆయన దేశ ప్రజల హక్కుల్ని, స్వేచ్ఛను బీజేపీ దౌర్జన్యంగా లాక్కుంటోందని మండిపడ్డారు.