Maharashtra: దేవేంద్ర ఫడ్నవీస్ అరెస్టుకు ఉద్ధవ్ ప్రభుత్వం కుట్ర.. ఆలస్యంగా వెలుగులోకి తెచ్చిన మహా సీఎం షిండే
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నారు
- tony bekkal
- Published on- February 26, 2023 / 08:41 PM IST
Was Witness To Conspiracy Plan To Arrest Devendra Fadnavis Says Shinde
Maharashtra: మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో అప్పటి విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను అరెస్ట్ చేసేందుకు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కుట్ర పన్నిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆలస్యంగా వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ అరెస్ట్ కుట్రకు తానే సాక్ష్యమని ఆయన ఆదివారం స్పష్టం చేశారు. ఫడ్నవీస్ సహా గిరీష్ మహాజన్‌లను సైతం అరెస్ట్ చేసేందుకు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని షిండే ఆరోపించారు.
“అప్పటి ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, గిరీష్ మహాజన్‌లను అరెస్టు చేయడానికి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం వేసిన ప్రణాళికకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ ప్రభుత్వం మహాజన్‌పై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం 1999ని ప్రయోగించాలని ప్రణాళిక వేసింది. వాస్తవానికి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పాలని అనుకోలేదు. కానీ వారిని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైంది” అని సీఎం షిండే అన్నారు.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే ఈ కుట్రకు పాల్పడిన వారిపై తమ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షిండేను ప్రశ్నంచగా.. “వారిని గద్దె నుంచి దింపడమే సరైన పని. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడుతున్నారో నాకు బాగా తెలుసు. ఒకవేళ అవసరం వస్తే దీని మీద విచారణ చేపడతాం” అని అన్నారు.
Nagaland polls: ఎన్నికల సిబ్బందితో వస్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు
వాస్తవానికి తనను అరెస్ట్ చేయడం గురించి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఏడాది జనవరిలో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా పేర్కొన్నారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తనను అరెస్టు చేసే యోచనలో ఉందని అన్నారు. యాదృచ్ఛికంగా ఫడ్నవిస్ ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక గిరీష్ మహాజన్ రాష్ట్ర వైద్య విద్య – పరిశోధనా మంత్రిగా ఉన్నారు.
