Nagaland polls: ఎన్నికల సిబ్బందితో వస్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

నాగాలాండ్ అసెంబ్లీకి సోమవారం (ఫిబ్రవరి 27) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60 నియోజకవర్గాలు ఉన్నాయి

Nagaland polls: ఎన్నికల సిబ్బందితో వస్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

1 died, 13 injured as bus carrying personnel on election duty overturns in Nagaland

Updated On : February 26, 2023 / 7:48 PM IST

Nagaland polls: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని తీసుకువస్తున్న బస్సు ఆదివారం బోల్తా కొట్టడంతో ఒకరగ మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. వోఖా జిల్లాలోని డోంగ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు వద్ద అడవీ ప్రాంతంలో మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి మరో 10 నిమిషాల్లో చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరిగిందట. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు, ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విమానంలో దీమాపూర్‭కు తరలించినట్లు వెల్లడించారు.

Rajesh Mishra: ‘ఎమ్మెల్యే to లా’.. 12 తరగతి పరీక్ష హాలులోకి హాల్ టికెట్, ప్యాడ్‭తో బీజేపీ నేత

నాగాలాండ్ అసెంబ్లీకి సోమవారం (ఫిబ్రవరి 27) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60 నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

RS Praveen Kumar: ప్రీతి ఘటనకు మతం, రాజకీయం రంగులు పులమాలని చూస్తే ఖబడ్దార్.. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ హెచ్చరిక