అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ రెమ్యునరేషన్ కార్మికులకు ఇవ్వండి : పవన్ కు హితవు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ

  • Publish Date - November 5, 2019 / 11:15 AM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ నేతలను పవన్ టార్గెట్ చేస్తే.. మంత్రులు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, పవన్ కల్యాణ్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. బొట్టు పెట్టుకుని ఎంతో అమాయకంగా అవంతి శ్రీనివాస్ తన చుట్టూ తిరిగేవారని.. మంత్రి కాగానే అవన్నీ మర్చిపోయారా అని పవన్ ప్రశ్నించారు.

దీనికి మంత్రి అవంతి కౌంటర్ ఇచ్చారు. కాపు యువతను పెడదోవ పట్టించేలా పవన్ వ్యవహార శైలి ఉందన్నారు. మంత్రులు బొత్స, కన్నబాబుపై పవన్ వ్యాఖ్యలను అవంతి ఖండించారు. ప్రభుత్వం తీరు కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, వారి కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అవంతి బదులిచ్చారు.

పవన్ కల్యాణ్ కు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ రెమ్యునరేషన్ ను భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని హితవు పలికారు. జగన్ 3వేల కిలోమీటర్లకు పైగా నడిస్తే పవన్ 2కిలోమీటర్లు కూడా నడవలేకపోయారని మంత్రి అవంతి విమర్శించారు. కాపు నాయకత్వం అంటే పవన్‌ మాత్రమేనా అని మంత్రి అవంతి నిలదీశారు.

ఇసుక కొరతను నిరసిస్తూ పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షోభంలో కూరుకుపోయారని, ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పవన్ ఆరోపించారు. వెంటనే ఇసుక సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు