Sanjay Nishad to PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రక్తంతో లేఖ రాసిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?

ఇలా లేఖ రాయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్‭లకు రక్తంతో లేఖలు రాశారు. తన సహచరులతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి రాశారు.

Blood Letter: సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం కూడా లేదు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరమవుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకూ మారుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు ఒక వింత చర్యకు పాల్పడ్డారు. నిషాద్ సమాజ సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రక్తంతో లేఖ రాశారు. అనంతరం ఆయన స్పందిస్తూ తన జీవితమంతా నిషాదులకే అంకితమని, కొన్ని విష పాములు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని నిషాద్‌రాజ్ గుహ కోట నుండి మసీదును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అటు ప్రభుత్వం, ఇటు ముస్లిం సమాజానికి కూడా ఆయన విజ్ణప్తి చేశారు.

అయితే ఆయన ఇలా లేఖ రాయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్‭లకు రక్తంతో లేఖలు రాశారు. ఆ లేఖలో మత్స్యకారులకు ఎస్సీ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలని సంజయ్ నిషాద్ డిమాండ్ చేశారు. తన పార్టీ అయిన నిషాద్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరఖ్‌పూర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ కేటగిరీ కింద మత్స్యకారులకు రిజర్వేషన్ల డిమాండ్‌ను మరోమారు ప్రస్తావించారు. ఇందుకోసం సంజయ్ నిషాద్ తన సహచరులతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి రాశారు.