జగన్ పేరుతో ఫోన్లు : ఆధారాలతో సహా బయటపెట్టిన మంత్రి

డేటా వార్.. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. డేటా చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి టీడీపీ

  • Publish Date - March 5, 2019 / 04:28 AM IST

డేటా వార్.. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. డేటా చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి టీడీపీ

విజయవాడ: డేటా వార్.. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. డేటా చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి టీడీపీ వాడుకుంటోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తుంటే.. టీఆర్ఎస్ సాయంతో తమ కార్యకర్తల సమాచారాన్ని దొంగిలించి వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. డేటా చోరీ చేసినందుకు ఏపీ ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దేవినేని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్‌లపై విమర్శలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ చేతులు కలిపి ఏపీ పోలీసులుపై కేసులు పెడుతున్నారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. జగన్‌ను ఎన్నికల్లో గెలిపించాలనే తాపత్రయంతో కేసీఆర్ తప్పుడు కార్యక్రమాల చేస్తున్నారని అన్నారు. ఇది అమరావతిపై దండయాత్రగా అభివర్ణించారు. జగన్ పేరుతో టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు వస్తున్నాయని మంత్రి దేవినేని ఆరోపించారు. ఇందుకు ఆధారాలు కూడా చూపించారు. 040 38134078 నెంబర్‌తో తమ కార్యకర్తకు ఫోన్ వచ్చిందని, ఓ ఆడియోని మంత్రి మీడియాకు వినిపించారు.
Also Read : ప్రభాస్ ను కొట్టలేదు.. జస్ట్ తాకింది అంతే..!

కేసీఆర్ నాయకత్వంలో వైసీపీ, బీజేపీ నేతలు పని చేస్తున్నారని మంత్రి ఉమ ఆరోపించారు. ఏపీలో ఓట్లు తొలగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబును ఎదుర్కోలేక మోడీ, జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల కుట్రలకు వ్యతిరేకంగా ఏపీలో 13 జిల్లాల్లో ర్యాలీలు చేపడతామని, కేసీఆర్ కుట్రలను తిప్పికొడతామని మంత్రి ఉమ అన్నారు. కేసీఆర్ కుట్రలను జాతీయ స్థాయిలో లేవనెత్తుతామని చెప్పారు.