ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు : సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివరణ

సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.

  • Publish Date - November 22, 2019 / 03:40 PM IST

సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.

సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. తన నియోజవర్గం సమస్యలపై సీఎం జగన్ తో చర్చించామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు. ప్రధాని కనపడితే నమస్కారం చేయడం సహజమన్నారు. బీజేపీతో వైసీపీ ఎంపీలు ఎవరూ టచ్ లో లేరని చెప్పారు. సుజనా చౌదరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. 

శుక్రవారం(నవంబర్ 22, 2019) అమరావతిలో సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణంరాజుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని జగన్ కు ఆయన వివరణ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఇంగ్లీష్ మీడియంకు సంబంధంచి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆయన వివరణ తీసుకోవాల్సిందిగా పార్టీ కీలక నేత, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. 

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో కృష్ణంరాజుపై అనేక ప్రచారాలు జరిగాయి. ఆయన బీజేపీలో చేరుతారంటూ అనేక ప్రచారాలు చేశారు. దీంతోపాటు వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ ఇంటికి వచ్చి కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన పరిణామం. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సివచ్చింది, ఏ పరిస్థితుల్లో చేయాల్సివచ్చిందన్న అంశాలపై ఆయన సీఎం జగన్ కు వివరణ ఇచ్చారు. 
 

ట్రెండింగ్ వార్తలు