నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సమస్యల కారణంగా మరణించినట్లు హాస్పిటల్ వారు తెలిపారు. ఏప్రిల్ 3నుంచి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. విషమ పరిస్థితుల్లో వెంటిలేటర్‌పైనే చికిత్స తీసుకుంటుననారు.
2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలోకి చేరిన ఆయనకు నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ టీడీపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఆయన ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. వయస్సు పైబడటంతో ప్రచారం చేస్తున్నప్పటి నుంచే కొద్దిపాటి అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు.