Subramanian Swamy: ఓవైసీ దేశభక్తుడే కానీ జాతీయవాది కాదు.. రెండింటికీ తేడా ఏంటంటే?

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఓవైసీ కోరారు. వాస్తవానికి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఓవైసీ తాజా అంశాన్ని లేవనెత్తారు

Subramanian Swamy: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశభక్తుడేనని అయితే జాతీయవాది మాత్రం కాదని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అయితే దేశభక్తుడికి జాతీయవాదికి గల తేడాను కూడా ఆయన స్పష్టం చేశారు. దేశభక్తుడు అంటే విదేశీ శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలనుకునే వాడని, అయితే జాతీయవాది అంటే దేశాన్ని ప్రేమించడంతో పాటు దేశ ప్రాచీన సాంస్కృతిక జీవనంలో బతికేవాడని అన్నారు. ఆ విధంగా చూసుకుంటే దేశంలో హిందువులు మాత్రమే జాతీయవాదులని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఓవైసీ కోరారు. వాస్తవానికి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఓవైసీ తాజా అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయాన్ని ఒక నెటిజెన్ లేవనెత్తుతూ ‘‘దేశభక్తుడు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి.. దేశద్రోహి అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు రిజర్వేషన్ కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సున్నీలు మినహా మిగిలిన ముస్లింలను ఎస్సీ,ఎస్టీల్లో చేర్చాలని నేను అనుకుంటున్నాను. దాంతో దళిత ముస్లిం ఐక్యతలోని వాస్తవికత బహిర్గతమవుతుంది’’ అని ట్వీట్ చేశాడు.

దీనికి సుబ్రహ్మణ్య స్వామి బదులిస్తూ ‘‘దేశభక్తుడు అంటే విదేశీ శక్తుల నుంచి తన దేశాన్ని కాపాడాలి అనుకునేవాడు, కాపాడేవాడు. ఓవైసీ దేశభక్తుడు. అందులో అభ్యంతరం లేదు. కానీ అతడు జాతీయవాది కాదు. జాతీయ వాది అంటే దేశం మీద ప్రేమతో పాటు ఇక్కడి పురాతన సాంస్కృతిక జీవనాన్ని అవలంబించేవాడు. ఇలా చూసుకుంటే ఇక్కడి సగటు హిందువు జాతీయవాది అని చెప్పొచ్చు’’ అని ట్వీట్ చేశారు.

Pak: విదేశీ పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి.. రాజీనామా చేస్తున్నట్లు అక్కడి నుంచే ప్రకటన

ట్రెండింగ్ వార్తలు