కడప, పులివెందుల ఎంపీ టికెట్లు బీసీలకు ఇస్తారా : జగన్ కు పవన్ సవాల్

  • Publish Date - March 14, 2019 / 01:08 PM IST

రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. కడప, పులివెందుల ఎంపీ స్థానాలను బీసీలకు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. బీసీ సదస్సులు పెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదని జగన్ పై మండిపడ్డారు. పవన్ ను కాపు వ్యక్తిగా చూస్తున్నారని అని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. నాకు కులం లేదన్నారు. మతం, ప్రాంతం తరఫున తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. బీసీలకు అండగా నిలబడిన ఏకైక పార్టీ జనసేన మాత్రమే అన్నారు. యువతకు మంచి భవిష్యత్ ఇవ్వడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడారు.
Read Also : ముఖ్యమంత్రి పదవిపై కోరిక లేదు : పవన్ కళ్యాణ్

మార్పు కోసమే యుద్ధం చేస్తున్నా అని పవన్ చెప్పారు. నాకు రాజకీయ పోరాటమే కానీ వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. జగన్, లోకేష్ తో శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా వాళ్లందరూ కూడా మార్పు కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని పవన్ పిలుపునిచ్చారు. అన్యాయంపై గళమెత్తడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. సీఎం పదవిని ఒక బాధ్యతగా చూడాలని పవన్ హితవు పలికారు.
Read Also : ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?

దాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవాలని చూడకూడదన్నారు. డబ్బు తనకు ఎప్పుడూ ఆనందానివ్వలేదన్నారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు.. కానిస్టేబుల్ కొడుకు ఎలా గెలుస్తాడు, పార్టీ నడపలేడు అని విమర్శలు చేశారని అన్నారు. నేను అడుగు వేస్తే తల తెగిపోవాలి.. కానీ అడుగు వెనక్కి వేయను అని పవన్ అన్నారు. సమాజం, వ్యవస్థలో మార్పు రావాలని జనసేనాని ఆకాంక్షించారు.
Read Also : అభివృద్ధి చేస్తారనే కొందరి పల్లకీలు మోశాను : పవన్ కళ్యాణ్