పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకున్నారు. బీజేపీతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Pawan Kalyan Postponed Tour Capital Villages 24052

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకున్నారు. బీజేపీతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకున్నారు. బీజేపీతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మహిళలపై జరిగిన దాడి అమానుషమన్నారు. ఒకవేళ రాజధాని తరలి వెళ్లినా ఇది తాత్కాలికమేనని పవన్ పేర్కొన్నారు. ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు ఇవ్వడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పీఏసీలో చర్చించాక రాపాకపై చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు…మూడు రాజధానులు కావాలా అని అడిగారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టండి…రాజధాని మార్పు ఎందుకని నిలదీశారు.

రాజధాని తరలిపోతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీని ఢీకొట్టాలంటే జనసేన, బీజేపీ వల్లే సాధ్యం అన్నారు. రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి అమరాతికే వస్తుందన్నారు.