ఏరికోరి తెచ్చుకున్న సీఎస్ ని సడెన్ గా ఎందుకు బదిలీ చేశారు

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపింది. సీఎస్ బదిలీపై జనసేన

  • Publish Date - November 4, 2019 / 02:13 PM IST

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపింది. సీఎస్ బదిలీపై జనసేన

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపింది. సీఎస్ బదిలీపై జనసేన అధినేత పవన్ స్పందించారు. జగన్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యంను ఏరి కోరి తెచ్చుకున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు సడన్ గా ఎందుకు బదిలీ చేసిందని పవన్ నిలదీశారు. సీఎస్ ను బదిలీ చేసిందంటే కచ్చితంగా పాలనలో అవకతవకలు జరుగుతున్నట్లేనని అన్నారు. పాలనలో లోపాలు ఉండబట్టే సీఎస్ ను బదిలీ చేశారని కామెంట్ చేశారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి విశాఖలో మీడియాతో పవన్ మాట్లాడారు.

సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆ పదవిలోంచి బదిలీ చేశారు. బాపట్లలోని హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంచార్జ్ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరబ్ కుమార్ ప్రస్తుతం సీసీఎల్ ఏ లో పని చేస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌ నీరబ్ కుమార్‌కు అప్పగించి.. తన విధుల్లో చేరాలని జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీతో అధికార యంత్రాంగం షాక్ అయ్యింది. ఎన్నికల ముందు ఏపీ సీఎస్ గా సుబ్రమణ్యం బాధ్యతలు స్వీకరించారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయనే కొనసాగుతూ వచ్చారు. మార్పు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ బదిలీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు ఎల్వీ. చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. మొదట్లో ఢిల్లీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా సీఎం జగన్ వెంటే ఉన్నారు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం.

ఇక లాంగ్ మార్చ్ కదు రాంగ్ మార్చ్ అని వైసీపీ నేతలు చేసిన విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. తనను విమర్శిస్తే తాను పట్టించుకోనని.. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం వదిలేది  లేదని స్పష్టం చేసారు. ఇప్పటికే సమస్య పరిష్కారానికి ప్రభుత్వంలో మేధావులు ఉన్నారని వారి సూచనలు తీసుకోవాలన్నారు. తమ పార్టీలోని వారి సూచనలు..సలహాలు సైతం అందించటానికి సిద్దంగా ఉన్నామన్నారు. తనను విమర్శించడం మాని ఇసుక సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని పవన్ హెచ్చరించారు.

మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లపై పవన్ మండిపడ్డారు. కన్నబాబుకి తన సోదరులు రాజకీయ జీవితం ఇచ్చారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి… వారి మీద కృతజ్ఞతతో వ్యవహరించాలన్నారు. అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యంలో తన వెంట ఎలా తిరిగేవారో అప్పుడు పార్టీలో ఉన్న వారందరికీ తెలుసన్నారు పవన్. బొట్టు పెట్టుకుని సౌమ్యంగా ఉండే అవంతి తన చుట్టూ తిరిగారని… ఇప్పుడు మంత్రి కాగానే అన్నీ మర్చిపోయి నా మీదే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు