Asaduddin Owaisi: రక్తంతో హోలీ చేసుకున్నారు.. పుల్వామా దాడిపై సత్యపాల్ మాలిక్‭ను తీవ్రంగా దూషించిన ఓవైసీ

పుల్వామా ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సత్యపాల్ మాలిక్‭కు తెలుసు. అయినప్పటికీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. 2019 లోక్‭సభ ఎన్నికల్లో మోదీని గెలిపించాలని ఆయన కోరుకున్నారు. అంతే కాకుండా తన గవర్నర్ పదవిని కాపాడుకోవాలనుకున్నారు.

Asaduddin Owaisi: పుల్వామా అమరవీరుల రక్తంతో హోలీ చేసుకున్నారంటూ జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ‭మీద హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా దూషించారు. ఈ ఘటన జరిగిన అనంతరమే ఎందుకు బయటికి వచ్చి చెప్పలేదని, పదవిని కాపాడుకోవడం కోసమే మౌనంగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే పుల్వామా దాడి కొద్ది రోజులుగా సత్యపాల్ మాలిక్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. భద్రతా వైఫల్యం వల్లే ఆ దాడి జరిగిందని స్పష్టం చేసిన ఆయన ఈ విషయం మోదీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించారనే అర్థంలో ఆయన చెప్తున్నారు.

Punjab Police : పంజాబ్ పోలీసుకు సెల్యూట్ కొడుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఆయనేం చేశారంటే?

‘‘పుల్వామా ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సత్యపాల్ మాలిక్‭కు తెలుసు. అయినప్పటికీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. 2019 లోక్‭సభ ఎన్నికల్లో మోదీని గెలిపించాలని ఆయన కోరుకున్నారు. అంతే కాకుండా తన గవర్నర్ పదవిని కాపాడుకోవాలనుకున్నారు. అందుకే మౌనంగా ఉన్నారు. అమరవీరుల రక్తంతో ఆటలాడారు. నిజంగా ఆయనకు దేశం మీద ప్రేమే ఉంటే గవర్నర్ కుర్చీని తన్నేసి బయటికి వచ్చి అసలు విషయం వెల్లడించేవారు. కానీ అలా చేయలేదు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. ఇదేం దేశభక్తి?’’ అని ఓవైసీ అన్నారు.

Chandrababu Naidu : వైసీపీ ఒక్క సీటు గెలిచినా ఉరి వేసుకున్నట్లే- చంద్రబాబు

ఏప్రిల్ 14న ‘ది వైర్’ అనే మీడియా సంస్థకు సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన చాలా విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. సైనికులను తరలించడానికి విమానాలు కావాలని తాను ముందుగానే కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే అందుకు హోంమంత్రిత్వ శాఖ నో చెప్పిందని అన్నారు. ఆ తర్వాతే సైనికుల వాహనంపై దాడి జరిగిందని అన్నారు. అంతే కాకుండా దాడి గురించి మోదీకి సమాచారం అందించగా.. ఈ విషయం బయటికి చెప్పొద్దని అన్నారని, తన నోరు మూయించారని అన్నారు. బహుశా ఓట్ల కోసమే అలా చేసుంటారనే కోణంలో సైతం సత్యపాల్ మాలిక్ స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు