Siddaramaiah: సావర్కర్, మోదీలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు చెప్పడం. సావర్కర్‌కు హిట్లర్ ఫిలాసఫీ స్ఫూర్తి. హిందుత్వను ప్రారంభించింది కూడా సావర్కర్ నాయకుడిగా ఉన్న హిందూ మహాసభనే'' అని అన్నారు.

Siddaramaiah: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వీర్ సావర్కర్‌లపై కర్ణాటక విపక్ష నేత సిద్ధరామయ్య మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సావర్కర్‌కు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తి అని, మోదీకి స్ఫూర్తి కూడా ఆయనేనని అంటూనే దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరీగా మార్చాలని చూస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ”దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు చెప్పడం. సావర్కర్‌కు హిట్లర్ ఫిలాసఫీ స్ఫూర్తి. హిందుత్వను ప్రారంభించింది కూడా సావర్కర్ నాయకుడిగా ఉన్న హిందూ మహాసభనే” అని అన్నారు.

Maharashtra: గవర్నర్ పదవి నుంచి దిగిపోతానంటున్న భగత్‭సింగ్ కోశ్యారి.. మోదీకి సందేశం

బీజేపీ నాయకత్వాన్ని కూడా హిట్లర్‌తోనూ, ఇతర నియంతలతోనూ సిద్ధారామయ్య పోల్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిట్లర్, ముస్సోలిని మధ్య పోలికలను ఆయన వివరిస్తూ.. బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ”ఆయన ప్రధాని. ఆయనను రానీయండి. మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, ఆయన వందసార్లు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబితే మాత్రం, అదెప్పటికీ జరగదని నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. ప్రజలు కూడా అలాంటివి నమ్మరు. హిట్లర్‌కు ఏం జరిగింది? కొద్ది రోజులుగా ఆడంబరంగా తిరిగారు. ముస్సోలిని, ఫ్రాన్కో విషయంలో జరిగింది కూడా అదే. మోదీది కూడా ఇలాంటి కొద్ది రోజుల ఆడంబరమే” అని సిద్ధరామయ్య అన్నారు.

Digvijaya Remark: దిగ్విజయ్ ‘సర్జికల్ స్ట్రైక్స్’ వ్యాఖ్యలతో కాంగ్రెస్‭కు సంబంధం లేదట

ట్రెండింగ్ వార్తలు